జూన్ నాటికి యూనిఫామ్ అందించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ నాటికి యూనిఫామ్ తయారీ పూర్తిచేసి అందించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, లత, డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
జిల్లాలో 1,853 మందికి ప్రొసీడింగ్స్
ఎల్‌ఆర్‌ఎస్–2020 స్కీమ్ క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1,853 మందికి ప్రొసీడింగ్స్‌లు ఇచ్చామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో మొత్తం 58,990 దరఖాస్తులు అందగా 2,569 మంది రూ.12కోట్ల చెల్లించారని తెలిపారు. ఇందులో 1.853 మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ శ్రీనివాస్, డీపీఓ యాదయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment