లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
- 8లో
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు గుండెపునేని లక్ష్మీదామోదర్‌రావు. ఈమెది మోతె మండలం రావిపహాడ్. ఈమెకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గతేడాది రెండెకరాల్లో మిర్చి సాగు చేసింది. దీనికోసం రూ.2.50లక్షలు పెట్టుబడి పెట్టింది. మొత్తం 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.20వేలకుపైనే ధర పలకడంతో మొత్తం రూ.6లక్షలు వచ్చాయి. కూలీలకు, పెట్టుబడి ఖర్చులు పోను లాభసాటిగానే ఉంది. కానీ, ఈ సంవత్సరం ఎకరంన్నర సాగు చేయగా రూ.2.35 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. ఇప్పటివరకు ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.13వేల చొప్పున అంతా అమ్మినా రూ.లక్షపైచిలుకే వస్తాయి. ఈ సంవత్సరం పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆమె వాపోయింది. ఇదీ ఈమె ఒక్కామెదే కాదు జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగుచేసిన రైతులందరి పరిస్థితి.
ప్రస్తుతం ధర
రూ.13 వేలు