
లడ్డూ తప్ప.. దేశంలో మరే సమస్యా లేదా?
– సీమాన్ ఆగ్రహం
సాక్షి, చైన్నె : దేశంలో ఏ సమస్యా లేదా? అంతా లడ్డూ గురించి చర్చించుకుంటున్నారు? అని నామ్ తమిళర్ కట్చి కన్వీనర్, సినీ దర్శకుడు, నటుడు సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శివగంగైలో జరిగిన కార్యక్రమంలో శనివారం సీమాన్ లడ్డూ వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిపేశారని ప్రస్తుతం కొత్త సమస్యను కొందరు సృష్టిస్తున్నారని, అందులో కొవ్వు ఉన్నా తాను తింట్టానని, లేకున్నా తింట్టానని వ్యాఖ్యానించారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లపై దాడులు చేస్తూ, గుండుగీయించి పంపుతున్నా.. అది సమస్యగా కనిపించడం లేదా? లడ్డూ సమస్యే పెద్దదిగా కనిపిస్తోందా..? అని విమర్శించారు.
మోసం కేసులో యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: కుట్రాంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నారని చెప్పి యువకులను మోసం చేసి నగదు అపహరిస్తున్న యువకుడిని తెన్‌కాశి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కుట్రాలంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నట్లు చెప్పి యువకులను నమ్మించి వారి వద్ద నగదు తీసుకుని మోసం చేస్తున్నట్లు తెన్‌కాశి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. విచారణలో పొల్లాచికి చెందిన ప్రభాకర్ అనే యువకుడు sokka.in అనే వెబ్‌సైట్ మూలంగా కుట్రాళంలో వ్యభిచారానికి మహిళలు ఉన్నట్లు చెప్పి వారిని మోసం చేస్తున్నట్లు తెలిసింది. యువకుడని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాము కాటుకు మహిళ మృతి
సేలం: పాము కాటుకు ఓ మహిళ మృతిచెందింది. పొల్లాచ్చి కోట్టూర్ రోడ్డు నెహ్రూనగర్‌కు చెందిన రవి భార్య శాంతి (58). వీరి కుమారుడు సంతోష్. వీరు ఒక పిల్లిని పెంచుతున్నారు. ఈ స్థితిలో సంఘటన సంభవించిన రోజు పిల్లి ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్న కాట్టువీరియన్ పామును నోటితో పట్టుకుని ఇంట్లో ఉన్న గదిలో వదిలింది. ఆ గదిలో నిద్రపోతున్న శాంతిని కాటు వేసింది. వెంటనే ఆమెను కుమారుడు సంతోష్, పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతిచెందింది. పెంపుడు పిల్లి యజమాని ప్రాణానికి పాశంగా మారిన వైనం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment