159 విద్యా సంస్థలకు గుర్తింపు
● మైనారిటీ కమిషన్ చైర్మన్ అరుణ్
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సంస్థల ఆధీనంలో వున్న 159 విద్యా సంస్థలకు శాశ్వత గుర్తింపును ఇచ్చినట్టు మైనారిటీ కమిషన్ చైర్మన్ అరుణ్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మైనారిటీలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ నిధుల కేటాయింపు, వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారం అంశాలపై కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మైనారిటీల సంక్షేమ పథకాలను సక్రమంగా అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల ఆధీనంలో వున్న ఎయిడెడ్ విద్యాసంస్థలను గుర్తించి 159 సంస్థలకు శాశ్వత గుర్తింపు ఇచ్చినట్టు వివరించారు. జిల్లాలో మైనారిటీలకు ప్రధాన సమస్య శ్మశానానికి స్థలం లేకపోవడమేనన్నారు. అనంతరం 22 మంది మహిళలకు రూ.4.12 లక్షలు స్వయం ఉపాధికి రుణాలు, మరో 20 సంఘాలకు రూ.3లక్షల ఆర్థికసాయం, 11 మందికి మత బోధకులకు గుర్తింపుకార్డు సహా 55 మందికి రూ.7.53 లక్షల విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. కమిషన్ కార్యదర్శి సంపత్, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, డీఆర్వో రాజ్‌కుమార్, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment