సమావేశాలకు హాజరు కావాల్సిందే!
సాక్షి, చైన్నె: మండల కమిటీ, వార్డు కమిటీల సమావేశాలకు అధికారులు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని చైన్నె కార్పొరేషన్‌మేయర్ ఆర్ ప్రియ ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు తప్పదని హెచ్చరించారు. గురువారం రిప్పన్ బిల్డింగ్‌లో చైన్నె కార్పొరేషన్ పాలక మండలి సమావేశం జరిగింది. మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ నేతృత్వం వహించారు. ఇందులో డీఎంకే కార్పొరేటర్ సెమ్మోళి సతీష్‌కుమార్ తన ప్రసంగంలో కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. మండల కమిటీలు, వార్డు కమిటీలు, వివిధ రకాల కమిటీల సమావేశాలకు అధికారులు ఎవ్వరూ హాజరు కావడం లేదని, ఇలాంటి పరిస్థితులలో సమస్యలను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం శారు. ప్రజలు తమను నిలదీస్తున్నారని పేర్కొంటూ ప్రశ్నిస్తూ అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమిటీల సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని, కమిషనర్‌ను వారంలో ఒక రోజు కార్పొరేటర్లు కలిసి సమస్యలు తెలియజేయడానికి సమయం కేటాయించాలని పట్టుబట్టారు. ఇందుకు మేయర్ ప్రియ స్పందిస్తూ కార్పొరేషన్‌నేతృత్వంలో మండల, వార్డు కమిటీలే కాకుండా, ఆరు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయని, ఈ కమిటీల సమావేశాలకు అధికారులు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పదని హెచ్చరించారు. కమిటీల సమావేశాలలో చేసే తీర్మానాలు ఇక్కడ ఆమోదానికి వస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇక మీదట అధికారులు తప్పని సరిగా కమిటీల సమావేశానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చైన్నెలో అల్పాహార పథకం ప్రైవేటు పరం చేయనున్నట్టుగా వచ్చిన సమాచారం కార్పొరేషన్ దృష్టికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మేయర్ మాట్లాడుతూ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
అధికారులకు మేయర్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment