సేలం : సమాజ సేవకుడు జగఫర్ అలీ మృతదేహాన్ని తవ్వి తీసి పరిశోధించడానికి హైకోర్టు మదురై శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుదుకోట్టైకు చెందిన సమాజ సేవకుడు జగఫర్ అలి చట్ట విరుద్ధంగా పని చేసే రాళ్ల క్వారీకి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. దానిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వరుస ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఈ స్థితిలో సంబంధిత క్వారీ నిర్వాహకులు లారీ ఎక్కించి జగఫర్ అలీని హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ మదురై కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జగఫర్ సాధిక్ అలీ మృతదేహాన్ని తవ్వి తీసి పరిశోధించి, అదేచోట స్కాన్ చేయడానికి హైకోర్టు మదురై శాఖ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అతని భార్య ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త జగఫర్ అలీ శవపంచనామా నివేదిక 10 రోజుల తర్వాత ఇచ్చారని, అందులో తమకు సందేహం ఉన్నట్టు, తన భర్త మృతదేహాన్ని మరో మారు పరిశీలన జరపాలని కోర్టును కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన మృతదేహాన్ని తవ్వి తీసే ఏర్పాట్లను పోలీసులు చేపట్టారు.
బియ్యం తిని బాలిక మృతి
అన్నానగర్: అతిగా బియ్యం తిని ఓ బాలిక మృతిచెందింది. తూత్తుకుడి జిల్లా వెండ్రనై సమీపంలోని ఆదనూరు తూర్పు వీధికి చెందిన రామస్వామి కుమార్తె మాలతి (11). స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. ఈమె తరచూ బియ్యం తినడం ఆనవాయితీ. అదేవిధంగా బియ్యం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో జీర్ణం కాకపోవడంతో బాలిక అస్వస్థతకు గురైంది. బాలికను గత 27న చికిత్స నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది,
ఫోటో..40.
జగఫర్ అలీ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment