నిఘా వలయంలో చైన్నె
సాక్షి, చైన్నె: చైన్నె నగరం, శివారులను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్‌తో పాటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తదితరుల ప్రముఖులు శుక్రవారం చైన్నెకు రానున్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శనకు కాంగ్రెస్ పిలుపు నివ్వడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంటి శుభకార్య వేడుక శుక్రవారం ఈసీఆర్‌లోని రిసార్ట్‌లో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి, హోంశాఖ మంత్రితో పాటూ పలువురు కేంద్రమంత్రులు, ఆంధప్రదేశ్, తెలంగాణతో పాటూ వివిధ రాష్ట్రాల నుంచి వీఐపీలు, తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో విమానాశ్రయం నుంచి పల్లావరం మీదుగా ఓఎంఆర్, ఈసీఆర్‌ను కలిపే మార్గాలలో ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ పరిసరాలన్నీ నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఈసీఆర్, ఓఎంఆర్ పరిసరాలను రెడ్‌జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలాంటి నిరసనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపట్టారు. మానవ రహిత విమానాలు, రిమోట్ ఉపయోగించి నడిపే ఇతర డ్రోన్లు వంటి వాటికి నిషేధం విధించారు. ముట్టకాడు, మహాబలిపురం పరిసరాలను పూర్తిగా నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. మైక్రో–లైట్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారా గ్లైడర్‌లు వంటి వాటికి నిషేదం విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా చైన్నె విమానాశ్రయంతో సహా గ్రేటర్ చైన్నె పోలీసుల అధికార పరిధిలోని రాజ్ భవన్ నుంచి ఈసీఆర్ వైపుగా వెళ్లే మార్గాన్ని సైతం రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ మార్గాల్లో వీఐపీల తాకిడి అధికం కానున్న దృష్ట్యా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా జాగత్తలను విసృతం చేశారు. తాంబరం కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలన్నీ భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు.
నేడు ఉపరాష్ట్రపతి, అమిత్ షా రాక
నల్లజెండాల ప్రదర్శనకు కాంగ్రెస్ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment