వైద్యం కోసం వచ్చిన వారిని చంపేశాడు! | - | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం వచ్చిన వారిని చంపేశాడు!

Published Fri, Jan 31 2025 2:26 AM | Last Updated on Fri, Jan 31 2025 2:26 AM

వైద్య

వైద్యం కోసం వచ్చిన వారిని చంపేశాడు!

● బహుళ అంతస్తుల భవనంలో తండ్రి, కుమార్తె మృతదేహాలు ● 3 నెలలుగా ఏ ఒక్కరూ పట్టించుకోని వైనం ● బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి డాక్టర్‌ కిరాతకం

సాక్షి, చైన్నె: వైద్యం కోసం చైన్నెకు వచ్చిన తండ్రి, కుమార్తె మూడు నెలలుగా బహుళ అంతస్తుల భవనంలోని ఓ ప్లాట్‌ నుంచి బయటకు రాకున్నా, ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. వైద్యం కోసం వెళ్లిన వారు అదృశ్యం కావడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో తిరుముల్‌లై వాయిల్‌ పోలీసులు గురువారం రంగంలోకి దిగారు. ఆ ప్లాట్‌లోకి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో ఆ ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. అయితే ఆ మృతదేహాల నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా ఓ డాక్టరు కిరాతకం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వేలూరుకు చెందిన శామ్యువేల్‌(78) ఆయన కుమార్తె సింధియా(35) చైన్నె ఓఎంఆర్‌లోని ఆస్పత్రికి తరచూ వైద్య చికిత్సకు వచ్చి వెళ్తుండే వారు. భర్తకు విడాకులు ఇచ్చి తండ్రికి సేవలు చేసుకుంటున్న సింధియా వేలూరుకు తరచూ వెళ్లి రావడం కష్టంగా ఉండటంతో చైన్నె శివారులోని తిరుముల్‌లై వాయిల్‌ తిరుమలివాసన్‌ నగర్‌లో ఓ బహుళ అంతస్తుల భవనంలో ప్లాట్‌ను అద్దెకు తీసుకుంది. గత మూడు నెలలుగా వీరి నుంచి తమకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో వేలూరులోని బంధువులు ఆరా తీయడం మొదలెట్టారు. చైన్నెలో ఎక్కడున్నారో అన్నది తెలియక సతమతం అయ్యారు. ఎట్టకేలకు చిరునామాను సేకరించి తిరుముల్‌లై వాయిల్‌ పోలీసులను ఆశ్రయించారు.

కుళ్లిన స్థితిలో మృత దేహాలు..

గురువారం ఉదయాన్నే ఆ బహుళ అంతస్తుల భవనంలోని ప్లాట్‌ తలుపులు పగుల కొట్టి లోనికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర షాక్‌కు గురి చేశాయి. కుళ్లిన స్థితిలో, ఎముకలు సైతం బయట పడ్డట్టుగా వారి మృతదేహాలు పడి ఉన్నా, కనీసం ఎలాంటి దుర్వాసన రాక పోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మూడు నెలలుగా తండ్రి, కుమార్తె మృతదేహం ప్లాట్‌లో పడి ఉన్న సమాచారం అక్కడి తీవ్ర కలకలం రేపింది. ఆ ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడం గురించి ఇరుగు పొరుగువారు కూడా పట్టించుకోక పోవడం విచారకరం. అదే సమయంలో దుర్వాసన రాకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి.

దర్యాప్తు వేగాన్ని పెంచిన పోలీసులకు ఓ డాక్టరు తరచూ వచ్చి వెళ్తుండడం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న సింధియా సెల్‌ ఆధారంలో చివరికాల్‌ కాంచీపురం జిల్లా ఒరికై ్క భారతీ దాసన్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ రాణా శామ్యుయేల్‌ ఎబినేషర్‌కు వెళ్లి ఉండడంతో అతడిపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న సింధియాతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎబినేషర్‌కు పరిచయం ఏర్పడింది. స్వతహాగా అతడు డాక్టర్‌ కావడంతో ఆయన చెప్పిందంతా చేయడం మొదలెట్టింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆమె తండ్రికి తానే చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాడు. తనకు తెలిసిన వారి బహుళ అంతస్తుల ప్లాట్‌ను తిరుముల్‌లై వాయిల్‌లో ఇప్పించాడు. దీంతో తరచూ ఇక్కడకు వచ్చి ఆమె తండ్రికి వైద్య సేవలు అందిస్తూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో సరిగ్గా మూడు నెలల క్రితం ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సింధియ డాక్టర్‌ను నిలదీసింది. ఇరువురి మధ్య జరిగిన గొడవలో కిందపడ్డ సింధియ తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. ఇద్దరు మరణించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో డాక్టర్‌ ఎబినేషర్‌ తన వైద్య మెళుకువల ఆధారంగా వ్యూహాన్ని రచించాడు. వాళ్లు సాధారణంగా మరణించినట్టుగా సృష్టించే దిశగా ప్రయత్నం చేశాడు. ఇద్దరి మృతదేహాలను ఒకే గదిలో పెట్టాడు. మృతదేహాల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా రసాయనాలను ఉపయోగించాడు. మృతదేహాలు కుళ్లి పోకుండా ఉండే రీతిలో ఆ గదిలో నిరంతరం ఏసీ పనిచేసే విధంగా చేశాడు. తాళం వేసి ఏమీ ఎరుగనట్టుగా వెళ్లి పోయాడు. మూడు నెలలుగా ఎవ్వరూ వారి గురించి ఆరా తీయక పోవగా, చివరకు బంధువులు కొందరు స్పందించడంతో తండ్రి, కుమార్తె మృతదేహాన్ని పోలీసుల కనుగొన కలిగారు. ఈ డాక్టర్‌కు సహకారంగా మరెవ్వరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైద్యం కోసం వచ్చిన వారిని చంపేశాడు! 1
1/1

వైద్యం కోసం వచ్చిన వారిని చంపేశాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement