డీఎస్పీ రాజీనామా
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీలో విద్యార్ధినిపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణ బృందంలోని డీఎస్పీ రాఘవేంద్ర కె రవి తన పదవికి రాజీనామా చేశారు. ఉన్నతాఽధికారులకు గురువారం లేఖ పంపించారు. అన్నావర్సిటీలో విద్యార్ధినిపై జరిగిన లైంగిక దాడి పెను రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈకేసును హైకోర్టు ఆదేశాలతో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారిణుల నేతృత్వంలోని బృందం విచారిస్తోంది. ఈ బృందంలో పలువురు డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారిణులకు ఇది రెండవ కేసుగా చెప్పవచ్చు. అయితే డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్న వారు సీనియర్లుగా పలు కేసులను ఛేదించి ఉన్నారు. ఇందులో డీఎస్పీ రాఘవేంద్ర కె రవి కూడా ఒకరు. హఠాత్తుగా ఆయన మెడికల్ సెలవులో వెళ్లడమే కాకుండా, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఈ బృందంలోని అధికారిణులు ఒత్తిళ్లు అధికంగా ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో అస్సలే ఈ కేసులో ఆసారు ఎవరో అన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఈ రాజీనామా మరింత వివాదానికి దారి తీసినట్లయ్యింది.
11 ఏళ్లు పరార్
సేలం: షార్జీ నుంచి చైన్నెకి వచ్చిన విమానంలో కేరళలో పలు కేసుల్లో సంబంధం ఉండి 11 ఏళ్లుగా పరారీలో ఉన్న వ్యక్తి చైన్నె విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం, మలప్పురం సమీపంలో తిరురంగాడి ప్రాంతానికి చెందిన అబ్దుల్ బషీర్ (53). ఇతని గత 11 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోని పోలుసు స్టేషన్‌లో నమ్మక ద్రోహం, మోసం వంటి కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో సంబంధం ఉన్న అబ్దుల్ బషీర్‌ను అరెస్టు చేసి విచారించాలని గాలిస్తూ వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న బషీర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విదేశాలకు వెళ్లిన అబ్దుల్ బషీర్‌ను అరెస్టు చేయడానికి కేరళ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో షార్జా నుంచి బుధవారం అర్ధరాత్రి చైన్నె విమానాశ్రయానికి ఎయిర్ అరేబియా విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికుల పాస్‌పోర్టు వంటి ఆధారాలను అధికారులు పరిశీలించారు. అప్పుడు అబ్దుల్ బషీర్ పోలీసు వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బషీర్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మెరీనా బీచ్‌లో చెత్త వేయడం మన సంస్కృతి కాదు
గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయం
కొరుక్కుపేట: మెరీనా బీచ్‌లో చెత్త వేయడం మన సంస్క్కృతి కాదనిగ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పొంగల్ రోజున మెరీనాలో అధికసంఖ్యలో గుమికూడిన ప్రజలు సముద్ర తీరంలో పేరుకుపోయిన చెత్తా చెదారానికి సంబంధించి సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్వయంగా ముందుకు వచ్చి కేసును విచారణకు స్వీకరించింది. వినాయక చతుర్థి సందర్భంగా, పొంగల్ సందర్భంగా మేరీనా బీచ్ చూసేందుకు తరలివచ్చే ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. చెత్త వేస్తే జరిమానా విధిస్తామని పేర్కొనడంపై ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా, పొంగల్ పండుగకు గుమిగూడడం సంస్కృతి అని, కానీ చెత్త వేయడం సంస్కృతి కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వమే ఉదాహరణగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని పేర్కొంది. అలాగే కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మార్చి అయిదో తేదీకి వాయిదా వేసింది.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment