
గంగాధర: జీవనోపాధి కోసం అఫ్గానిస్తాన్‌లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన పెంచాల వెంకటేశ్వర్‌రావు అలియాస్ వెంకన్న విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఆ దేశంలో చిక్కుకుపోయాడు. అఫ్గానిస్తాన్ దేశంలోని కసబ్‌లో ఏసీసీఎల్ కంపెనీలో వెంకటేశ్వరరావు తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆరు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చివెళ్లేవాడు.
ఈ నెల 15న స్వదేశానికి రావడానికి విమాన టికెట్ కూడా తీసుకున్నాడు. అయితే పది నిమిషాలు ఆలస్యం కావడంతో విమానం వెళ్లిపోయింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాను అమెరికా సైనికుల వద్దనే ఉన్నానని.. త్వరలోనే వస్తానని ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు అతని కుటుంబసభ్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment