
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది.
అయితే, గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ కేబినెట్ వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీఎస్ నుంచి టీజీగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా మంగళవారం రవాణా, రహదారుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment