
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టు రెండు సంవత్సరాలుగా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను పెంచటం పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
న్యాయశాఖకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు..
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపుపై న్యాయశాఖకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు.
చదవండి: లాక్‌డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు
Telangana: పోలీసులకు తీపికబురు
Comments
Please login to add a commentAdd a comment