జొమాటో, స్విగ్గీల వంటి ఫుడ్ యాప్‌లకు హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కస్టమర్ బేస్ ఉంది. సదరు ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు కోరుకుంటారు. ఫుడ్ యాప్‌లకు రెస్టారెంట్లుండవు. వారు సిటీలోని పలు రెస్టారెంట్లపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో వారు కోరుకున్న రుచులు శరవేగంగా అందించేందుకు పుట్టుకొచ్చినవే క్లౌడ్ కిచెన్స్.
స్పీడ్.. క్లౌడ్..
∙భోజన ప్రియులను కూర్చోబెట్టి ఆతిథ్యం అందించే రెస్టారెంట్ తరహా వసతులేవీ లేకుండా కేవలం ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుని వండి సరఫరా చేసేవే క్లౌడ్ కిచెన్లు. అలా చాలా రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నప్పటికీ, ధర, టైమ్, నాణ్యత, రుచి లో కూడా క్లౌడ్ కిచెన్లు మరింత మెరుగ్గా ఉంటున్నాయంటున్నారు సిటిజనులు. నగరంలో డైన్ ఇన్ సేవలు అందించే కొన్ని పేరొందిన రెస్టారెంట్స్ తమ కిచెన్‌కు అనుబంధంగా ఈ తరహా క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తుండగా కొన్ని ఇతర బ్రాండ్లకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నాయి.
కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు కిచెన్ ఏర్పాటు చేసి నిపుణులను నియమించుకుని బిజినెస్ ప్రారంభించేసే అవకాశం ఉండడం అనేక మందిని ఆకర్షిస్తోంది. జాతీయ స్థాయిలో పేరొందిన రెబల్ ఫుడ్స్ నగరంలో 30కిపైగా కిచెన్స్‌ను నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాడు. ఇక మన టాలీవుడ్ నటుడు నాగచైతన్య షోయు పేరుతో స్విగ్గీపై తన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాడు. మరో నటుడు రానా సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాడు.
కోవిడ్.. క్లౌడ్ దౌడ్...
∙కోవిడ్ ఉద్ధృతి టైమ్‌లో, ఆ తర్వాత కూడా నగరవాసులు రెస్టారెంట్స్‌లో తినే అలవాటు తగ్గించుకున్నారు. దీంతో డైన్ ఇన్ రెస్టారెంట్స్ బాగా దెబ్బతిన్నాయి. (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2021లో రెస్టారెంట్ పరిశ్రమ 53 శాతం కుదేలైంది.) ఆ పరిస్థితిలోనే క్లౌడ్ కిచెన్ల ఊపందుకున్నాయి.
∙క్లౌడ్ కిచెన్ల నిర్వహణలో భాగంగా మార్కెటింగ్, డిజిటల్ బ్రాండింగ్‌పై తప్పనిసరి. ఆహారం ఆర్డర్లు మోసుకొచ్చే జొమాటో, స్విగ్గీ వంటి మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించాలి. ఇంట్లో వండే అలవాటు తగ్గుతున్న మధ్య తరగతి వల్ల భవిష్యత్తులోనూ ఈ తరహా కిచెన్లు మరిన్ని రావడం తధ్యమని ఆన్‌లైన్ రెస్టారెంట్ల పరిశ్రమలో అతిపెద్ద సంస్థ రెబల్ ఫుడ్స్‌కి చెందిన కల్లోల్ బెనర్జీ అంటున్నారు.
ఒకటే కిచెన్ ఆరు బ్రాండ్స్..
అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ...కోవిడ్ సమయంలో క్లౌడ్ కిచెన్స్‌కు బాగా ఆదరణ పెరిగింది. మేం ప్రస్తుతం 2 బ్రాండ్స్ పేరిట చైనీస్ ఫుడ్, బిర్యానీలు ఆన్‌లైన్ సప్లయి చేస్తున్నాం గతంలో 6వరకూ అందించిన అనుభవం ఉంది. ఆకట్టుకునే ప్యాకేజీ, అందుబాటు ధర, నాణ్యత మూడూ ఈ బిజినెస్‌లో చాలా ముఖ్యమైనవి.
– రుత్విన్ రెడ్డి, దావత్ క్లౌడ్ కిచెన్స్
పెద్ద ప్లేస్ అక్కర్లేదు. వెయిటర్స్, ఫ్రంట్
డెస్క్ స్టాఫ్ అవసరం లేదు. పార్కింగ్ స్పేస్ ఇవ్వక్కర్లేదు. ఏసీలూ, ఫర్నిచరూ.. వగైరాలూ తప్పనిసరి కాదు. పెట్టుబడి కూడా స్వల్పమే. కానీ ఓ పెద్ద రెస్టారెంట్‌కి పోటీ ఇవ్వొచ్చు. అదే రెస్టారెంట్‌కి ఆదాయ వనరుగా కూడా మారొచ్చు. ఊపందుకుంటున్న ఆ వ్యాపారం పేరే క్లౌడ్ కిచెన్. నాగచైతన్య, రానా వంటి సినీ తారలు కూడా ఈ ట్రెండీ బిజినెస్‌కు మేము సైతం అంటున్నారు.
చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు!
Comments
Please login to add a commentAdd a comment