
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. '' ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతా. ఈనెల 21న వరంగల్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు చేస్తా. 10 రోజులు సమయం ఇచ్చి తనిఖీలకు వస్తా. గ్రామ సభలు నిర్వహించకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు.