న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్‌పై సమీక్ష జరపలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని, బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారించి అధికారులు తేల్చాల్సి ఉంది.
అన్నింటికీ సీబీఐ విచారణ అడిగే హరీష్ రావు, కేటీఆర్.. ఫోన్ టాపింగ్ అంశాన్ని సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని సీఎ రేవంత్ ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదని, అలాంటి పనులు కూడా చేయనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment