
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి.. అంటే 2014 నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నరగా.. టీఎస్‌పీఎస్సీలో పేపర్ల లీక్‌లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
Comments
Please login to add a commentAdd a comment