సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా డ్రై రన్‌ను రెండు జిల్లాల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. శనివారం హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో కేంద్రంలో 3 విడతలుగా డ్రై రన్ నిర్వ హిస్తారు. ఒక్కోచోట కనీసం 100 మందిని భాగస్వామ్యం చేస్తారు. అందులో కొందరు వైద్యులు, మరి కొందరుపౌరులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. చదవండి: (‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం)
టీకా వేసుకునే వారిని కేంద్రానికి వచ్చేలా చేయడం, కరోనా నిబంధనలను పాటించేలా క్యూలో నిలబెట్టడం, వారి సమాచా రాన్ని కోవిడ్ యాప్‌లో నమోదు చేయడం వంటి వాటిని ఈ డ్రై రన్‌లో చేపడతారు. సాఫ్ట్‌వేర్ పని తీరును పరిశీలిస్తారు. డ్రై రన్ విజయవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రిజ్వీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment