కేసీఆర్‌ జన్మదినం: బాబుకు కేసీఆర్‌గా నామకరణం | Couple Names Son After KCR In Adilabad | Sakshi
Sakshi News home page

KCR Birthday: బాబుకు కేసీఆర్‌గా నామకరణం

Published Fri, Feb 18 2022 2:27 AM | Last Updated on Fri, Feb 18 2022 11:03 AM

Couple Names Son After KCR In Adilabad - Sakshi

ఇచ్చోడ(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా(కే) గ్రామంలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్రామానికి చెందిన వాగ్మరే భాగ్యశ్రీ, చంద్రకాంత్‌ దంపతులు గురువారం తమ కుమారుడికి కేసీఆర్‌గా నామకరణం చేశారు.

సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌ మాట్లాడుతూ.. బాబు తల్లిదండ్రులకు ప్రభుత్వం దళితులకు భూమి పంపిణీ పథకం కింద మూడెకరాలు ఇచ్చిందని, భూమి అభివృద్ధి కోసం రైతుబంధు, ఇతర పథకాల ద్వారా ఆ కుటుంబం రూ.22 లక్షల ప్రభుత్వ సహాయం పొందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు తమ కుమారుడికి 21వ రోజు సందర్భంగా కేసీఆర్‌గా నామకరణం చేసి అభిమానం చాటుకున్నారని పేర్కొన్నారు.
(చదవండి: మేడారానికి కేసీఆర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement