
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బోథ్(ఆదిలాబాద్): మండలానికి చెందిన ఓ మహిళకు మూడుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొదటిసారి నెగెటివ్, రెండోసారి పాజిటివ్, మూడోసారి నెగెటివ్ వచ్చింది. దీంతో ఆ మహిళా కుటుంబసభ్యులు కంగుతిన్నారు. మహిళకు దగ్గు, జలుబు లక్షణాలు ఉండడంతో సొనాల పీహెచ్‌సీలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. టెస్టులో నెగెటివ్ వచ్చింది. అయినా లక్షణాలు తగ్గకపోవడంతో నిర్మల్ ఆసుపత్రిలో పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది.
ఒకసారి నెగెటివ్, మరోసారి పాజిటివ్ ఎలా వస్తుందని కుటుంబసభ్యులు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు. మూడోసారి నెగెటివ్ రావడంతో కుటుంబసభ్యులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం మహిళా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment