కరోనా అంతానికి.. వైరస్‌ కిల్లర్‌  | Etela Rajender Launched New Mission For Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా అంతానికి.. వైరస్‌ కిల్లర్‌ 

Published Sat, Jul 25 2020 4:34 AM | Last Updated on Sat, Jul 25 2020 11:43 AM

Etela Rajender Launched New Mission For Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రపంచమంతా యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే తయారుచేసిన వైరస్‌ కిల్లర్‌ అనే పరికరాన్ని శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. ప్రపంచాన్ని సార్స్, ఎబోలా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని అంతం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది గాలిలో ఉన్న వైరస్‌ను తనలోకి లాక్కొని వాటిని అంతం చేయడం ద్వారా దానిని నిర్మూలిస్తుంది. (ప్లాస్మా దాతలు ఏరీ!)

ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ఉర్జా క్లీన్‌ టెక్‌ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదనరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణు భరద్వాజ్‌లు మంత్రికి ఈ పరికరం గురించి వివరించారు. పరికరం ఉన్న పరిసరాల్లో ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు. సెమినార్‌ హాళ్లు, తరగతి గదుల వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లలో ఈ పరికరాలు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. (ఆగస్టులో అల్లకల్లోలమే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement