![Farmers queue for cotton seeds](/styles/webp/s3/article_images/2024/05/29/cotton%20seeeds.jpg.webp?itok=HK-vmlaT)
ఆ విత్తనాల కోసం బారులు తీరిన అన్నదాతలు
షాపుల్లోకి వెళ్లేందుకు యత్నించగా అడ్డుకున్న పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గందరగోళ పరిస్థితి
ఆదిలాబాద్ టౌన్, బోనకల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తి విత్తన దుకాణాల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో అన్నదాతలు జిల్లా నలుమూలల నుంచి విత్తనాల కొనుగోలు కోసం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లోని ఆయా విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. డిమాండ్ రకం పత్తి విత్తనాల కోసం రైతులు కొద్ది రోజులుగా జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్తున్నారు.
ఇందులో భాగంగా వేకువజామునే భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. దుకాణ యజమానులు ఆధార్ కార్డు ఉన్నవారికి రెండు ప్యాకెట్లకు మించి ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కొందరు విత్తన దుకాణంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదు పు చేసేందుకు పోలీసులు లోనికి చొరబడ్డ రైతులను చెదరగొట్టారు.
ఈ సమయంలోనే కొంత మంది రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని రైతులకు డిమాండ్ రకం విత్తనాలు అందించాలని డీలర్లకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సన్నద్ధం కంటే ముందే అన్నదాతలకు విత్తన కష్టాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విత్తనాలకు డిమాండ్ ఉందో వాటిని కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ తర్వాత పోలీసులు దగ్గరుండి ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లను అందజేశారు.
లాఠీచార్జి చేయలేదు: ఎస్పీ గౌస్ ఆలం
జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల దుకాణాల వద్ద రైతులపై పోలీసులు ఎలాంటి లాఠీచార్జి చేయలేదని ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. విత్తన దుకాణాల వద్ద భారీగా చేరుకున్న రైతులను వరుసక్రమంలో నిలబడేలా మాత్రమే పోలీసులు చర్యలు చేపట్టారని వివరించారు. పోలీసులు రైతులను అడ్డుకున్నారని, చెదరగొట్టారనేది అవాస్తవమని తెలిపారు.
ఆ కంపెనీ పత్తి విత్తనాల కోసంరైతుల బారులు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలోని ఓ విత్తనాల షాపు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ విత్తనాల (యూఎస్ సీడ్స్) కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఆ పత్తి విత్తనాలను గత ఏడాది సాగు చేసిన రైతులకు అధిక దిగుబడి వచి్చందనే సమాచారంతో క్యూ కట్టారు. ఈ విషయమై వ్యవసాయాధికారి సరిత మాట్లాడుతూ ప్రభుత్వం ధ్రువీకరించిన చాలా రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నందున రైతులు ఒకే రకం కోసం ఆరాటపడొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment