నల్లగొండ: విద్యార్థుల మెదళ్లలో జ్ఞానబీజాలు నాటాల్సిన ఆయన, పొలాల్లో నాట్లేసేవారికి నారు అందిస్తున్నాడు... పాఠాలు చెప్పాల్సిన ఆయన పత్తిచేనులో పత్తి ఏరుతున్నాడు... కంపచెట్లు కొట్టి కడుపు నింపుకుంటున్నాడు. ఇదీ ఓ గెస్ట్ లెక్చరర్ దుస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కోల్‌ముంతల పహాడ్‌కు చెందిన బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడు.
ఆయనకు భార్య, కుమారుడు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. భూములు, ఆస్తులు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో 16 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు వ్యవసాయకూలీగా మారాడు. జిల్లాలో ఉన్న మొత్తం 150 మంది అతిథి అధ్యాపకులు కూడా ఆయనలాగే వేతనమందక యాతన అనుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment