
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల శనివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది. కాగా గత కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి : ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ)
Comments
Please login to add a commentAdd a comment