పోలీసుల వీడియో వైరల్‌.. యూనిఫాంలో కొనుగోళ్లు వద్దు!  | HYD: No More Police Officers To Avoid making Any Purchases In Uniform | Sakshi
Sakshi News home page

పోలీసుల వీడియో వైరల్‌.. యూనిఫాంలో కొనుగోళ్లు వద్దు! 

Published Fri, May 28 2021 10:06 AM | Last Updated on Fri, May 28 2021 10:39 AM

HYD: No More Police Officers To Avoid making Any Purchases In Uniform - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో నేపథ్యంలో నగర పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోలీసు సిబ్బంది, అధికారులు యూనిఫాంలో ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బుధవారం గస్తీ నిర్వహిస్తుండగా ఒకరు పండ్లు ఖరీదు చేశారు. ఓ కానిస్టేబుల్‌ మామిడి పండ్ల బండి వద్ద ఉండి ఆపై తన ద్విచక్ర వాహనంపై ఎక్కి కూర్చుకున్నారు.

మరో కానిస్టేబుల్‌ మాత్రం ఆ బండి చుట్టూ తిరుగుతూ మామిడి పండ్లు ఎంపిక చేసుకుని ఓ కవర్‌లో వేసుకున్నారు. ఇదంతా ఆ ప్రాంతంలోని భవనం పై నుంచి ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ కానిస్టేబుల్‌ పండ్ల వ్యాపారికి డబ్బులు ఇవ్వకుండా మామిడి పండ్లు తీసుకున్నారనే ఉద్దేశం వచ్చేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది బుధవారం వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే సదరు కానిస్టేబుల్‌ రూ.100 చెల్లించి రెండు కేజీల పండ్లు కొనుగోలు చేశారని తేలింది. అయితే యూనిఫాంలో ఉన్న నేపథ్యంలోనే ఈ అపార్థానికి కారణంగా మారిందని తేల్చారు. దీనిపై బోయిన్‌పల్లి పోలీసులు స్పందిస్తూ.. పోలీసు సిబ్బంది హాకర్లను బెదిరించి పండ్లు తీసుకెల్లినట్లు వార్తాపత్రికలో వచ్చిన సమాచారం పూర్తిగా అబద్ధమని తేల్చారు. ఈ నేపథ్యంలోనే గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: యాస్‌ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement