
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో లైకుల కోసం కొంతమందికి పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. రాత్రికిరాత్రి పేరు తెచ్చుకునేందుకు మూగజీవాలను హింసిస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోనే పాతబస్తీ యువకుడు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్’ పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాముపిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెంకొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇపుడు వైరల్‌గా మారింది.
ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. ‘అరేయ్ సాజిద్.. నీళ్ల బాటిల్ తీసుకురా..!’ అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది. దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని పట్టుకుని శిక్షించాలని బుధవారం డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతంలో కుక్కలను భవనం పైనుంచి విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు యువకుడిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment