కరోనా : ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో.. | Jagtial Hospital Staff Denied To Admit Corona Patient Due To Beds Shortage | Sakshi
Sakshi News home page

కరోనా : ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో..

Published Wed, Jul 29 2020 4:03 PM | Last Updated on Wed, Jul 29 2020 6:44 PM

Jagtial Hospital Staff Denied To Admit Corona Patient Due To Beds Shortage - Sakshi

సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో వైద్యులు అతని తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆ వ్యక్తి ఉంటున్నది అద్దె ఇళ్లు కావడంతో ఆ ఇంటి యజమాని లోనికి అనుమతించలేదు. దీంతో ఆ కరోనా పేషెంట్‌ రోడ్డున పడ్డారు. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కరోనా పేషెంట్‌ను మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తితోపాటు, అతని భార్య, ఇద్దరు కూతుళ్లను ఆస్పత్రిలోని గదిలో క్వారంటైన్‌ చేశారు. అయితే కరోనా సోకిన వ్యక్తి యమమాని మాజీ కౌన్సిలర్‌ కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement