రికార్డుల జోరు.. కేసీఆరు  | KCR is the only leader in Telangana who has been elected to the assembly eight times | Sakshi
Sakshi News home page

రికార్డుల జోరు.. కేసీఆరు 

Published Sun, Oct 15 2023 3:11 AM | Last Updated on Mon, Oct 16 2023 6:51 PM

KCR is the only leader in Telangana who has been elected to the assembly eight times - Sakshi

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన రాజకీయ జీవితంలో పలు రికార్డులు సృష్టించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేతితో నడిపి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ స్థానాన్ని కేసీఆర్‌ సుస్థిరం చేసుకున్నారు. ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో ఆ పార్టిలో చేరిన వ్యక్తుల్లో కేసీఆర్‌  ఒకరు. మూడు భాష ల్లో చాతుర్యం ఆయనకు కలిసి వచ్చింది. 1983 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికలలోనే సిద్దిపేట నుంచి ఆయనకు పోటీచేసే అవకాశం వచ్చింది.

కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటమి చెందారు. వైఫల్యాలే సాఫల్యాలకు మెట్టు అన్న సూక్తి కేసీఆర్‌ విషయంలో బాగానే వర్తిస్తుంది. తొలిసా రి పరాజయం చెందినా, ఆ తర్వాత 1985లో అక్కడి నుంచే గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూ డలేదు. సిద్దిపేటను ఆయన తన కంచుకోటగా మార్చుకున్నారు. నిత్యం ప్రజలలో ఉండడం, వాగ్దాటితో వారి ని ఆకర్షించడం ఆయనకు కలిసి వచ్చింది. 1989 ప్రాంతంలో కొద్దికాలం కరువు పరిస్థితులను పర్యవేక్షించే వారిలో ఈయన కూడా ఒకరయ్యారు. వీరికి కేబినెట్‌ హోదా ఉండడంతో కరువు మంత్రులని పిలిచేవారు.

కేసీఆర్‌ 1985, 1989, 1994, 1999, 2001, 2004లలో సిద్దిపేట నుంచి గెలిచారు. 2014, 2018లలో గజ్వేల్‌ నుంచి విజయపతాకను ఎగురవేశారు. ఈ చరిత్రను పరిశీలిస్తే 1995లో టీడీపీలో తిరుగుబా టు సమయంలో కేసీఆర్‌ కూడా చంద్రబాబునాయుడి పక్షంలోనే ఉన్నారు. అయినా చంద్రబాబు తన కేబినెట్‌లో చోటివ్వలేదు. అది ఆయనకు అసంతృఫ్తి కలిగించింది. సిద్దిపేట నుంచి వచ్చిన ఈయన మద్దతుదారులు రాజ్‌భవన్‌ వద్ద ఆందో ళన చేసినంత పనిచేశారు. కాగా తదుపరి విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. జన్మభూమి వంటి ప్రత్యే­క కార్యక్రమాల రూపకల్పనలో ఈయకు పాత్ర ఉంది.  

అప్పట్లో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. 
1999 ఎన్నికలలో వాజ్‌పేయి సానుభూతి అస్త్రం పనిచేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఎందువల్లో కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదు. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరైన విజయరామారావుకు  తటస్థుల కోటా అంటూ ఖైరతాబాద్‌ టికెట్‌ ఇవ్వడం ఆయన గెలుపొందడం, మంత్రి కావ డం జరిగింది. అదే ఉమ్మడి ఏపీ రాజకీయాలలో పెద్ద మలుపు అని చెప్పవచ్చు. కేసీఆర్‌ దీనిని తీవ్ర అవమానంగా భావించారు. దీంతో ఆయనను శాంతింప చేయడానికి ఉప సభాపతి పదవిని చంద్రబాబు ఇచ్చా­రు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు.

కేసీఆర్‌ కు మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు చారిత్రక తప్పి దం చేశారని చాలామంది సమైక్య రాష్ట్ర వాదులు భావి స్తుంటారు. అప్పట్లో మంత్రి పదవి ఇచ్చి ఉంటే ప్రత్యేక రాష్ట్ర ఆలోచన వైపు కేసీఆర్‌ వెళ్లకపోయేవారన్నది చాలామంది అభిప్రాయం. కాగా అప్పట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మాజీ మంత్రి ఇంద్రారెడ్డి వంటివారు, కొన్నివర్గాలు డిమాండ్‌ చేస్తుండేవారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వంటివారు తెలంగాణ మేధావులుగా అప్ప టికే గుర్తింపు పొందారు. అలాంటి వారితో  ఆయన చర్చలు జరిపేవారు. అందుకు ఆయన హోదా కూడా బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి, సిద్దిపేట సీటుకు రాజీనా­మా చేసి  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర  డిమాండ్‌తో అదే టికెట్‌పై పోటీచేసి ఉపఎన్నిక ద్వారా చంద్రబాబు కు సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను ఓడించడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డినా లాభం లేకపోయింది. ప్రస్తుతం కేసీఆర్‌ మంత్రివర్గంలో ఉన్న తలసాని శ్రీనివాస యాద వ్, బీఆర్‌ఎస్‌లోనే ఉన్న సీనియర్‌ నేత వేణుగోపాలాచా రి తదితరులు సిద్దిపేటలో టీడీపీ పక్షాన పనిచేశారు.  

2004 నుంచి మొదలు.. 
2004 నుంచి కేసీఆర్‌వి అన్నీ రికార్డులే అని చెప్పాలి. ఆ ఏడాది కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తన పార్టికి 26 సీట్లు సాధించారు. అదే టైమ్‌లో ఆయన కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు కూడా పోటీచేసి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ పై కాంగ్రెస్‌ అంత సానుకూలంగా లేదని భావించి పదవికి రాజీనా మా చేశారు. ఆ దశలో అప్పటి మంత్రి ఎం.సత్యనారాయణరావు చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలో మరో సారి గెలుపొందారు. అక్కడితో ఆగలేదు.

తన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయాలని ఆ­య­న ఆదేశించగా 16 మంది మాత్రమే  దాని­ని పాటించారు. అయి నా పట్టు వీడలేదు. తాను కూడా పదవికి మళ్లీ రాజీనా మా చేసి ఇంకోసారి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. ఒక నేత ఇలా ఒకే టర్మ్‌లో ఒక సాధారణ ఎన్నికతో స హా రెండు ఉపఎన్నికల్లో గెలవడం రికార్డు. 2009లో మహ­బూ­బ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి నెగ్గారు. తిరిగి 2014లో తెలంగాణ వచ్చాక గజ్వేల్‌ అసెంబ్లీతో పాటు మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి మళ్లీ గెలి చారు. అప్పటికి ఏడుసార్లు అసెంబ్లీకి, ఐదుసా ర్లు లోక్‌­స­భకు ఒక నేత ఎన్నికవడం తొలిసారి అని చె ప్పాలి. 2018లో 8వసారి అసెంబ్లీకి ఎన్నికై తెలంగాణ లో అన్నిసార్లు ఎన్నికైన ఏౖకైక నేతగా రికార్డు సృష్టించారు.  

సొంత రికార్డును బ్రేక్‌ చేసేలా.. 
2023లో  మళ్లీ రెండుచోట్ల శాసనసభకు పోటీచేస్తూ తన రికార్డును తానే అధిగమించే యత్నంలో కేసీఆర్‌ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇన్నిసార్లు ఎన్నికలలో పోటీచేసిందీ, గెలిచిందీ కేసీఆర్‌ ఒక్కరే అని చెప్పా­లి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నాలు­గు ఎన్నికలలో తొమ్మిది చోట్ల పోటీచేసి ఒకచోట ఓడిపో యి ఎనిమిది చోట్ల  గెలిచారు. కేసీఆర్‌ అలాకాకుండా తొమ్మిది ఎన్నికలలో పోటీచేసి ఎనిమిది సార్లు గెలవడం, మళ్లీ పదోసారి  పోటీకి సిద్ధమవడం విశేషం.

తెలంగాణ రాష్ట్ర సాధనకు రెండుసార్లు తన ఎమ్మెల్యేల తో రాజీనామా చేయించడం మరో రికార్డు. అన్నిటినీ మించి ఒక తెలంగాణ నేత ఇన్నేళ్లపాటు సీఎంగా ఉండడం సరికొత్త రికార్డు అని చెప్పాలి.  తెలంగాణ నేతలలో ఎవరూ తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండలేదు. పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్యలకు ఒక టర్మ్‌ కూడా పూర్తిగా చేసే అవకాశం రాలేదు. ఈ రకంగా కూడా కేసీఆర్‌ది ఒక రికార్డు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement