సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రలలకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ పార్టీనేనని పేర్కొన్నారు. మంత్రి శనివారం మాట్లాడుతూ.. 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించారని, పార్టీ ఏర్పాటు అయిన మూహుర్తం చాలా బలమైనదని అన్నారు. వంద సంవత్సరాల పాటు ఇలాగే పార్టీ ధృడండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (మాట నిలబెట్టుకున్న కేటీఆర్)
గతంలో చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుంచి తమను రోడ్డు పైకి గెంటేశారని, కానీ ముహూర్త బలంతో తామింత దూరం వచ్చినట్లు తెలిపారు. రోడ్డుపై పడ్డ పరిస్థితి నుంచి ఈ రోజు హైదరాబాద్ నడి బొడ్డున తెలంగాణ భవన్‌లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామని తెలిపారు. అన్నం తిన్నారో అటుకులు బుక్కారో కానీ అన్ని రకాల ఆటుపోట్లు ఎదురుకొని కార్యకర్తలు పార్టీని ఇంత ఎత్తుకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మొదటి 13 సంవత్సరాలు టీఆర్‌ఎస్ పార్టీపై అనేక కుట్రలు జరిగాయని, పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. (తొలిసారి 2 వేలకు పైగా కరోనా కేసులు)
‘టీఆర్‌ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రం ఒకటే లక్ష్యం. తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే మా లక్ష్యం. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు 47 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాము. కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. భారత దేశంలో ఏ పార్టీ లేనంత పటిష్టంగా టీఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఎలాంటి ఎన్నికలు అయినా ప్రత్యర్థులను మా పార్టీ కాకవికాలం చేస్తుంది. టీఆర్‌ఎస్ తిరుగులేని పార్టీ’ అని కేటీఆర్ తెలిపారు. (టిమ్స్ లో వసతులపై కిషన్ రెడ్డి అసంతృప్తి)
‘కార్యకర్తల ఇంటికే ఇన్సూరెన్స్ చెక్కులు అందించాం. జిల్లాలో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తి అయ్యాయి. కరోనా సంక్షోభంతో శిక్షణా కార్యక్రమలు వాయిదా వేశాం. కరోనా కష్టకాలంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలి. నా జన్మదినం సందర్భంగా నేను నా నియోజకవర్గానికి 6 అంబులెన్స్‌లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో మిగతా నాయకులు కూడా అందరూ కలిసి 100 పైగా అంబులెన్స్ లు సమకూర్చారు. కరోనా సంక్షోభం పూర్తిగా పొయ్యేవరకు ప్రజలకు అండగా ఉందాం’ అని పిలుపిచ్చారు. (సత్తి పూలు పూల అంగీ.. పూలు పూల లాగు..)
Comments
Please login to add a commentAdd a comment