సాక్షి, హైదారాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ తీసుకురాని బీజేపీ క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్‌ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. బీజేపీ మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం.. బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
బెంగళూరులాంటి సిటీలోనూ ఐటీఐఆర్ ఒక్క అడగు ముందుకు పడలేదన్నారు. బెంగళూరులోనూ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి మేమే కారణమా అని ప్రశ్నించారు. 2014 నుంచి రాసిన లేఖలు, రిపోర్టులు బండి సంజయ్‌కు ఇస్తామని, ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని కేటీఆర్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment