నల్లగొండ జిల్లాలో పెద్దగట్టు (దురాజ్ పల్లి) లింగమంతుల జాతర తర్వాతా అత్యంత ప్రాచుర్యం పొందిన రెండువ అతిపెద్ద జాతర. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిడమనూర్ మండలం. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన (శ్రీశ్రీ లింగమంతుల స్వామి- మణిక్యాలదేవి జాతర అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగిన జాతర
పూర్వం శoకరుడు, పార్వతి దేవి అవతారము పడిమారీ శoకరుడు లింగమంతులస్వామిగా మరియు పార్వవతి దేవి మాణిక్యాల దేవి గా జన్మించారు. వారి వివాహణాంతరం మాణిక్యాలదేవి లింగమంతులస్వామిని ఒక వరం కోరింది. అది ఏమనగా కృతాయుగంలో మన జన్మ సమాప్తం అవుతుంది. కాని కళయుగంలో మన కీర్తి కొనియాడి దేవతలుగా పూజింపబడాలని వరం కోరింది. ఆమే కోరిన ప్రకారంగా కళయుగం మొదటి దశకంలోనే ఈ ఎర్రబెల్లి గుట్టపైన బండ సోరికెలో నిలిచినారు. పోతరాజు పెద్దకుమారుడు భక్తరన్న ఆయన శిష్యులు అయిన బైకానివారు శివున్నీ కోలుస్తున్నారు. ఆ బైకాని వారిలో ఒకరు బుర్కల లింగయ్య గంగా స్నానానికి స్వామి ని , తీసుకోని ఆధానం తీసుకోని ఎర్రబెల్లి గ్రామం గుట్ట వద్ద నుండి వెలుతున్న సమయంలో ఆయనపై లింగమంతుల స్వామి శిగం [పూనకం] రూపంలో వచ్చి కెవ్వున కేక వేసాడు..
అప్పుడు ఆగట్టుకు ఒక వైపున మన్నెంవారు, మరియు మశిముక్కు వారు, మరియు గోపాలపురం వాస్తవ్వులు బోడవారు, కడారివారు, పగాడాల వారు, నల్ల్ళబోతు వారు. గొర్రెలను మందపెట్టి యున్నారు. ఆ సమయంలో వారి గొర్రెల మందకు తీవ్రమైన వ్యాధులు సోకి ఆనారోగ్యంతో ఉన్నవి.
ఆ కేక శబ్దం విని బుర్కల లింగం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన మీ ఎర్రబెల్లి గుట్టపైన లింగమంతుల స్వామి వెలసినారు. మీరు అయన జాతర చేయండి మీ గొర్రెల మందలు సుబిక్షంగా ఉంటవి అని చెప్పి వెల్లినారు. మా గొర్రల మందలు సుభాక్షంగా వుంటే మీ జాతర చేస్తాము అని ముక్కగా, వారి గొర్రెలకు ఆనారోగ్యం తొలగి పోయింది. ఒక నెల తర్వాత బుర్కల లింగం (బైకాని లింగం) గంగా స్నానం చేసుకోని వచ్చారు. ఆ నాటినుండి ఇప్పటి వరకు జాతర నిర్వగ్నంగా జరుగుతుంది.
350 సం|| లకు పూర్వం చెంచు గూడెం ఉండేది దీనిని చెంచు రాజులు పరిపాలించేవారు. చెంచు రాజుకు ఐదుగురు కుమారులు జన్మించినారు చెంగు రాజుకు ఆడ బిడ్డా సంతానం లేక పొగ వారు శంకరుడికి కొండబిక్షం క్రింద పూజ చేయగా . శివుడు ప్రత్యక్ష మైతాడు.ప్రత్యక్షమైన శివుడు ఏమి కావాలో కోరుకొమ్మ నగా మాకు కూతురుని ప్రసాదించమని కోరుకుంటారు. అందుకు శివుడు వరం ప్రసాదిస్తాను కానీ నాకు ఏం ఇస్తారు అని అడగా అందుకు చెంచురాజు ఏం కావాలో అడుగమని శివుని అడుగుతారు అప్పుడు శివుడు మీకు జన్మించినటువంటి కుమార్తెను యుక్తవయసుకు వచ్చిన తర్వాతా నాకు ఇచ్చి కళ్యాణం చేయ్యాలని అడుగుతాడు దానికి వారు అంగీకరిస్తారు.
కొంతకాలం తర్వాత చెంచురాజుకు ఆడసంతానం కలుగుతుంది. ఆమేకు (చెంచు వనిత) మాణిక్యాల దేవి అని నామకరణం చేయటం జరుగుతుంది. సౌదర్యవతి అయినటువంటి మణిక్యాలదీవి యుక్తవయసుకు వచ్చిన తర్వాతా శివుడు పరిణయం. ఆడమని అడుగుతాడు, అందుకు చెంచురాజు, మరియు దీరురాలు అయిన చెంచువనిత (మాణిక్యాలదేవి) ససేమిరా అంటుంది. ఆమే అంద చందాలకు లోనెటువంటి శివుడు లో పరుచు కోవటం కొరకు యుద్ధ ప్రకటిస్తారు. బలహీను రాలు అయిన చెంచు వనిత పారిపోయి గొర్రెల మందలు దాచుకోవటం జరుగుతుంది. శివుడు చెంచు గూడెంపై, వున్న గొర్రెలమందలో దూరి చెంచు వనితను ఎత్తుకురావటం, మరియు వివాహ చేసుకోవటం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment