సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మేయర్.. ధైర్యంగా ఉంటే కరోనా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల క్రితం మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా వెల్లడి కావడంతో అప్పట్లో పరీక్షలు చేయించుకోగా రెండు పర్యాయాలు నెగెటివ్‌గానే రిపోర్టులొచ్చాయి. అధికారులతో తరచూ సమీక్షలతోపాటు క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్న మేయర్, కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి శనివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం వెల్లడించారు.
తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించగా నెగెటివ్ రిపోర్టులొచ్చాయని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తాను ‘సెల్ఫ్ ఐసోలేషన్’లో ఉన్నట్లు పేర్కొన్నారు. చికిత్స పూర్తయ్యాక హాస్పిటల్స్‌లో ఉన్న కరోనా బాధితులకు వైద్యంలో భాగంగా తాను ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారితో కలిసి పెద్దఎత్తున ప్లాస్మా డొనేట్ చేసేందుకు తెలంగాణ భవన్‌లో శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మేయర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అతి త్వరలోనే సాధారణ స్థితికి వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
కరోనా బారిన హైదరాబాద్ మేయర్
Published Mon, Jul 27 2020 1:25 AM | Last Updated on Mon, Jul 27 2020 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment