
రాయదుర్గం: మిస్టర్ అండ్ మిస్ ఫ్యాషన్ గాలా–2024 అట్టహాసంగా సాగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ ప్రాంగణంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్‌మేనేజ్ మెంట్ కంపెనీ థర్డ్ ఐ ఎంటైర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 మంది మోడలింగ్ ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మోడల్, నటుడు ఈశ్వర్‌సాయి, ఫ్యాషన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ వంశీ పి పల్లెతో సహా పరిశ్రమ నిపుణుల బృందం ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులు ర్యాంప్ వాక్, టాలెంట్ షోకేస్, పర్సనాలిటీ రౌండ్‌తో సహా వివిధ రౌండ్లలో పోటీపడ్డారు. మిస్టర్ ఫ్యాషన్ గాలా–2024 విజేతకు లక్ష నగదు బహుమతి, రన్నరప్‌కు రూ.50వేలు అందిస్తారు. ప్రఖ్యాత ఫ్యాసన్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు, పరిశ్రమ నిపుణులు పాల్గొని ఈ ఫైనల్ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. షో నిర్వహణతో టీహబ్ ప్రాంగణమంతా సందడిగా మారింది.