సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్‌లతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌లలో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని గతంలో జారీ చేసిన ఉత్తర్వులు యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు. కేవలం సినిమా థియేటర్ మాత్రమే ఉంటే (స్టాండ్ ఎలోన్) పార్కింగ్ ఫీజులను వసూలు చేసుకోవచ్చని అన్నారు. సినిమా థియేటర్లలోని పార్కింగ్ ఏరియాల్లో ప్రేక్షకులు కాని వారు సైతం పెద్ద సంఖ్యలో వాహనాలు నిలుపుతుండటంతో నిర్వహణ కష్టంగా మారిందని థియేటర్ల యజమానుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఫీజులు వసూలు చేసుకోవడానికి అను మతిచ్చినట్టు తెలిపారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment