సాక్షి,హైదరాబాద్: మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో బుధవారం ఆయన ఒక పోస్ట్ చేశారు.
‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర బుధవారం(ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొక్కులు, దర్శనం కోసం భారీగా తరలి వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారనున్నాయి. 24 వరకు ఈ జాతర జరగనుంది.
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…
— Narendra Modi (@narendramodi) February 21, 2024
Comments
Please login to add a commentAdd a comment