సాక్షి టీవీ నిర్వహించిన ’స్ట్రెయిట్ టాక్’(ఉన్నది ఉన్నట్లు) ప్రొగ్రామ్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మంచి ఉద్యమ కారుడని, మంచి పాలనా దక్షకుడని స్వయంగా రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత అరుణ్ జైట్లీలు పేర్కొన్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్న కేటీఆర్..రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు కారణం కూడా కేంద్రమేనన్నారు. ఏదీ తేల్చకుండా రైతులను గోస పెడుతున్నారని, వాటాలు తేల్చకుండా అనుసంధానం అసాధ్యమన్నారు. మిషన్ భగీరథ లాంటి పథకాలను కేంద్రం స్ఫూర్తిగా తీసుకుందన్న కేటీఆర్.. అత్యధిక నిరుద్యోగ శాతం నరేంద్ర మోదీ హయాంలోనే చూస్తున్నామన్నారు. గ్యాస్,డీజిల్ ధరలు పెంచడం తప్ప కేంద్రం చేసిందేమీ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరెన్నో విషయాలను కేటీఆర్ పంచుకున్నారు.
కేటీఆర్‌తో నిర్వహించిన స్ట్రెయిట్ టాక్ ప్రొగ్రాం ఆదివారం ఉదయం 11.00 గంటలకు, తిరిగి ఆదివారం సాయంత్రం 7గంటలకు సాక్షి టీవీలో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment