సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై హత్యాచారం కేసులో దోషికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి ఊరి శిక్షను ఖరారు చేసింది.
కాగా, బీహార్‌కు చెందిన గఫార్ అలీ.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే కారణంగా కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి ఆమెను హత్యచేశాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గఫార్ అలీని దోషిగా నిర్ధారించింది. బాలికపై హత్యాచారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంగారెడ్డి కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఇక, ఈ ఘటన జరిగిన 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణ శిక్ష విధించారు.
ఇది కూడా చదవండి: స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment