సాక్షి, హైదరాబాద్: ‘దొంగల్లో ముఖ్యంగా ట్విట్టర్ టిల్లులో భయం, భీతి గొలిపే ఛాయలు ఎన్నడూ లేనంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆందోళన, అయోమయం అనుభవంలోకి వస్తున్న వారికి యోగా మంచిది. విచారణ, దర్యాప్తు సంస్థలు మీ తలుపు తట్టే వరకు గాలిని లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం వంటివి చేయాలని సూచిస్తున్నాను’.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదంటూ గురువారం సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పీఎం కార్యాలయాన్ని ఉద్దేశించి ‘బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్ని నడిపిస్తున్న డబుల్ ఇంజిన్ మోదీ–ఈడీ అని దీంతో అర్థమౌతోంది’ అని ట్విట్టర్‌లో పేర్కొనడం తెలిసిందే. కేటీఆర్ చేసిన ట్వీట్‌పై సంజయ్ స్పందిస్తూ ట్విట్టర్ టిల్లు అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment