సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో బుధవారం పాఠశాలల టైమింగ్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. రేపు చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాల ని 6.30 గం. ల వరకు నడపవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది.
అయితే.. రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని.. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీ లో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని తెలిపింది. ఒకవేళ రేపు సాయంత్రం చూడని పక్షంలో తర్వాతి రోజు పాఠశాల సమయంలో విద్యార్థుల కు పాఠశాల లో చూపించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసిన విద్యాశాఖ.. చంద్రయాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 లాండింగ్ నేపథ్యంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు టీ సాట్, టీ సాట్ నిపుణ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.
Comments
Please login to add a commentAdd a comment