
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15న జరగనున్న స‌్వాతంత్ర్య దినోత్సవ సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించాలని సోమవారం అన్ని జిల్లాల న్యాయస్థానాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో ఆంక్షల మధ్యే వేడుకలు జరుపుకోవాలని తెలిపింది. వైద్యారోగ్య శాఖ సూచనల ప్రకారం భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్కులు ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. 50 మందితోనే స్వాతంత్ర్య సంబురాలు జరుపుకోవాలని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వేడుకను సైతం 20 నిమిషాల్లో ముగించాలని స్పష్టం చేసింది. ఈ వేడుకలకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపవద్దని తెలిపింది. ఈ ఆంక్షలన్నింటినీ అన్ని జిల్లాల న్యాయస్థానాలు అమలు చేయాలని ఆదేశించింది. (ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment