
పాలడుగులో మాట్లాడుతున్న షర్మిల
వైరా: ప్రతిపక్షంలో సరైన నాయకులు లేకపోవడం, అందరూ టీఆర్‌ఎస్‌లోనే ఉండటం వల్ల ప్రజా సమస్యలపై ప్రభు త్వాన్ని ప్రశ్నించేవారు కరువ య్యారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామస్తులతో గురువారం సాయంత్రం ‘మాట– ముచ్చట’ నిర్వహించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రతిపక్షాల నుంచి గెలిచిన నాయకులు చాలామంది లైన్లో నిలబడిమరీ టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ఘాటుగా విమర్శించారు. ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. మద్యం రాబడితో రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.