హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఈ కార్ రేస్ కేసు అంశం ఇప్పుడు ఏసీబీ వద్దకు చేరింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి..ఏసీబీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో విచారణ కోరుతూ సీఎస్ లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను సీఎస్ జత చేశారు.
గవర్నర్ అనుమతితో ముందుకు..
సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది.
చదవండి: కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం!
Comments
Please login to add a commentAdd a comment