TSRTC: ఉద్యోగుల జీతాలు కట్‌.. ఈసీని కలిసిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ | TSRTC JAC Meets EC On Telangana Govt New GO When The Election Code Is In Force In The State - Sakshi
Sakshi News home page

TSRTC: ఉద్యోగుల జీతాలు కట్‌.. ఈసీని కలిసిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ

Published Wed, Nov 22 2023 2:45 PM | Last Updated on Wed, Nov 22 2023 3:32 PM

TSRTC JAC Meets EC On Telangana Govt New GO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు. 

వివరాల ప్రకారం..‘తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టీఎస్‌ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా జీవో ఇచ్చారు. హరిత నిధి పేరుతో కార్మికుల జీతాల నుంచి రూ.300 కట్‌ చేస్తున్నారు. అక్రమంగా జీవో ఇచ్చి జీతాలు కట్‌ చేయడం చట్టరీత్యా నేరం. జీవో రద్దు చేయాలని కమిషన్‌ను కోరాం’ అని తెలిపారు. 

మరోవైపు.. అశ్వథ్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement