
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిది రోజుల బాబుకు జాండీస్ వచ్చాయని తల్లిడండ్రులు నర్సంపేటలోని తనుష పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాబును పరీక్షించి ఫోటో తెరఫి బాక్సులో ఉంచి సెలైన్ పెట్టమని వైద్యుడు జాన్‌సన్ సిబ్బందికి చెప్పారు. కాసేపటి తరువాత తల్లిదండ్రులు చూసే సరికి గడువుతీరిన సెలైన్ బాటిల్‌ను బాబుకి ఎక్కిస్తున్నట్టు గమనించారు. అయితే అప్పటికే బాబు పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ బాబుని కోల్పోయామని మండిపడుతూ గొడవకు దిగారు.
చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై..
Comments
Please login to add a commentAdd a comment