
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అర్వపల్లి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన లింగంపల్లి లింగమ్మ(60)కి ఊపిరితిత్తులకు రంద్రాలు పడి ఆయసంతో రోజులు వెళ్లదీస్తుంది. అయితే ఆక్సిజన్ పెడితేనే ఆమె బతుకుతుందని వైద్యులు తేల్చడంతో ఆమె కుటుంబీకులు రెండు రోజులకు ఒక సిలిండర్ తెచ్చి పెడుతున్నారు. ఒక సిలిండర్ ఆక్సిజన్ రెండు రోజులపాటు వస్తుంది. ఒక్క సిలిండర్‌కు రూ. 2500 ఖర్చు చేస్తున్నారు.
అంటే రోజుకు రూ.1250 చొప్పున ఖర్చు అవుతుంది. కుటుంబీకులు కూలినాలి చేసి ఆమెను బతికిస్తున్నారు. ఆమెకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఏర్పాటు చేస్తే ఆక్సిజన్ అవసరం ఉండదని.. దాతలు సాయమందించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను అందించాలని ఆమె కుమారుడు సీతారాములు కోరుతున్నారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్‌కు రూ. 50వేలు ఖర్చు అవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment