
తిరుమల : తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పాములు కలకలం సృష్టించిన సంఘటన సోమవా రం చోటుచేసుకుంది. టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక గాలిగోపురం సమీపంలోని మెట్లదారిపై ఓ నాగుపాము వచ్చినట్లు దుకాణదారులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం స్థానిక ఫిల్టర్ హౌస్ వద్ద మరో పాము వచ్చినట్లు సిబ్బంది తెలపడంతో అక్కడికి చేరుకుని ఏడు అడుగుల జెర్రిపోతును పట్టుకున్నారు. అనంతరం వాటిని అవ్వాచ్చారి కోనలో విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment