
స్వాధీనం చేసుకున్న ప్రొక్లెయిన్‌తో అటవీశాఖ సిబ్బంది
తిరుపతి కల్చరల్ : చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా నూతన కమిటీ ఎంపిక చేశారు. శుక్రవారం నాయుడుపేట ఓ కన్వెన్షన్ హాల్లో కమిటీ ఎన్నిక చేపట్టారు. చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడిగా కేవీ చౌదరి, కార్యదర్శిగా కె.రఘురామిరెడ్డి, కోశాధికారిగా కేవీ ప్రసాద్‌తోపాటు కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీకి తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మోహన్ కుమార్ రాజు అభినందనలు తెలిపారు.
అడవిలో తవ్వితే పీడీ యాక్ట్
సైదాపురం : అడవిలో ఖనిజ సంపద కోసం తవ్వకాలు సాగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నెల్లూరు డీఎఫ్‌ఓ ఆవుల చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం సైదాపురంలో ఆయన మాట్లాడుతూ గులించెర్ల అటవీ ప్రాంతంలో నెల్లూరు రేంజర్ మాల్యాద్రి నేతృత్వంలో తనిఖీలు చేపట్టి ప్రొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు చేపట్టిన దాడుల్లో 4జేసీబీలు, ఓ ప్రొక్లెయిన్, టిప్పర్, ట్రాక్టర్ సీజ్ చేసినట్లు వివరించారు.

మాట్లాడుతున్న కేవీ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment