
మేలు మరువలేం
మాది పేద కుటుంబం.గతంలో కుటుంబ పోషణే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలువతో మా ఇబ్బందులు తీరాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో చిరువ్యాపారం మొదలుపెట్టా. ఏటా వచ్చే నగదులో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నా. అలాగే నాకు వితంతు పింఛన్ వస్తోంది. మా అత్తకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసరా పథకం కింద కూడా లబ్ధి చేకూరింది. జగనన్న మేలు మరవలేం.
– ఎం.ఇందిరమ్మ, సైదాపురం
జగనన్నే రావాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీ కాకుండా మహిళా పక్షపాతిగా నిలిచారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి మాలాంటి పేద మహిళలకు అండగా నిలబడ్డారు. ఆయన సాయంతోనే చక్కగా చిన్న వ్యాపారం పెట్టుకుని చీకూ చింతా లేకుండా ఉంటున్నాం. పేదల బాగుకోసం ఇంతగా శ్రమించే జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి.
– మంగుదొడ్డి బుజ్జమ్మ,
కలువాయి
భరోసా ఇచ్చారు
నా భర్త కొద్దిపాటి సంపాదనతో చాలీచాలని బతుకు మాది. అయితే జగనన్న మూడు విడతల్లో ఇచ్చిన వైఎస్సార్ చేయూతను సద్వినియోగం చేసుకున్నా.ఇంటి వద్దనే టిఫిన్ దుకాణం పెట్టుకున్నా. డ్వాక్రా రుణమాఫీ, సున్నావడ్డీ, జగనన్నతోడు పథకాలు అందించి జగనన్న భరోసా ఇచ్చారు. దీంతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది. నెలకు రూ.10వేలు తక్కువ కాకుండానే ఆదాయం వస్తోంది.
– సరస్వతి, వెంకటగిరి
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదలను ఎవరూ పట్టింకోలేదు. వైఎస్సార్‌సీపీ వచ్చిన తర్వాతే మాలాంటి పేదలకు మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న తోడు ద్వారా లబ్ధి చేకూరింది. కష్టకాలంలో ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది. ఇప్పటి వరకు తమ కుటుంబానికి రూ.1.80వేలు అందింది. ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
– నారాయణమ్మ, ఊటుకూరు
●



Comments
Please login to add a commentAdd a comment