
21వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె
తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పశువైద్య విద్యార్థుల సమ్మె ఆదివారానికి 21వ రోజుకు చేరింది. ఇప్పటికే పలు విధాలుగా వినూత్న నిరసలు తెలియజేసిన జూడాలు తమ గౌరవవేతనాన్ని పెంచేవరకు సమ్మె విరమించేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : మండలంలోని కరకంబాడి పంచాయతీ తారకరామనగర్‌లో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. ఐదో వీధిలో నివసిస్తున్న ఇబ్రహీం (43) సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల కుటుంబకలహాలు తలెత్తడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment