గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

Published Mon, Feb 24 2025 12:41 AM | Last Updated on Mon, Feb 24 2025 12:41 AM

గ్రూప

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

● అయోమయం సృష్టించడంతో అభ్యర్థుల అవస్థలు ● రాజకీయ వికృత క్రీడకు బలైన నిరుద్యోగులు ● వాయిదా టెన్షన్‌తో పరీక్ష సరిగా రాయలేక ఇబ్బందులు ● సర్కారు వ్యవహారశైలిపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసం అభ్యర్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. ఏపీపీఎస్సీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుండా గందగోళ వాతావరణం సృష్టించింది. గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై కప్పదాటు ధోరణి అవలంభిస్తూ యువతను అయోమయానికి గురి చేసింది. వాయిదా పేరిట శనివారం అర్ధరాత్రి వరకు యువతను టెన్షన్‌ పెట్టి నిలువునా వంచించింది. దీంతో చాలామంది ఎగ్జామ్‌కు హాజరుకాలేకపోయారు. వచ్చిన వారు కూడా సక్రమంగా రాయలేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత ఉద్యోగం దక్కుతుందని కోటి ఆశలతో కోచింగ్‌ తీసుకున్న వారు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కల్పించిన సర్కారు వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.

పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న గ్రూప్‌–2 అభ్యర్థులు

అయోమయం సృష్టించారు

గ్రూప్‌–2 పరీక్ష నిర్వహణపై అయోమయం సృష్టించారు. రూ.లక్షలు వెచ్చించి శిక్షణ తీసుకున్నాం. పరీక్ష జరుగుతుందో లేదో తెలియక శనివారం అర్థరాత్రి వరకు టెన్షన్‌ పడ్డాం. రోస్టర్‌ పద్ధతిపై పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఏపీపీఎస్సీ అధికారులు, ప్రభుత్వం మధ్య అవగాహ లేకపోవడంతో గందరగోళం సృష్టించారు. ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దారుణం. పరీక్షల్లో ఏపీ చరిత్ర, ఇండియన్‌ ఎకానమీ ప్రశ్నపత్రాలు పర్వాలేదు, కానీ, రెండో సెషన్‌లో జరిగిన ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రశ్న పత్రంతో ఇబ్బంది పడ్డాం. – వినోద్‌, గ్రూప్‌–2 అభ్యర్థి, ఎస్వీయూ

స్పష్టత రాకుండానే పరీక్షలు

గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్ష వివాదాస్పదమవడానికి ప్రధాన కారణం రోస్టర్‌ విధానం అమలులో స్పష్టత రాకపోవడం. మాలాంటి పేద విద్యార్థులందరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కొన్నేళ్ల పాటు పుస్తకాలకు అత్తుకుపోయి శ్రమించాం. అలాంటిది ప్రభుత్వం రోస్టర్‌ రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వకుండా పరీక్షలు నిర్వహంచడం దారుణం. పరీక్షలు నిర్వహించారు కానీ రిజల్ట్‌ విడుదల, పోస్టింగ్‌ల విషయంలో వాయిదాలు వేయకుండా ఏపీపీఎస్సీ సక్రమంగా నిర్వహిస్తుందా అన్నది అనుమానంగా ఉంది. – ఉమేష్‌, గ్రూప్‌–2 అభ్యర్థి, తిరుపతి

పేద విద్యార్థులకు నష్టమే

పారదర్శకతతో గ్రూప్‌–2 ఉద్యోగాలకు రోస్టర్‌ విధానం అమలు చేసి తీరాల్సిందే. లేదంటే పేద విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. రోస్టర్‌ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాత గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి ఉంటే బాగుండేది. ఆదివారం జరిగిన పరీక్ష ప్రశ్న పత్రం శైలి చాలా సులువుగా సాధారణ విద్యార్థి సైతం జవాబులు గుర్తించే విధంగా ఉంది. అయితే రోస్టర్‌ అమలు చేస్తేనే అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది.

– షణ్ముగం, గ్రూప్‌–2 అభ్యర్థి, తిరుపతి

తిరుపతి సిటీ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఆడిన నాటకానికి జిల్లాలో వేల మంది గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఏపీపీఎస్సీ అధికారులు, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం కారణంగా పరీక్ష జరుగుతుందో లేదో అన్న అనుమానంతో శనివారం అర్థరాత్రి వరకు అభ్యర్థులు మానసికంగా నానా అవస్థలు పడ్డారు. రోస్టర్‌ విధానంపై స్పష్టత రాకముందే పరీక్షలు నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాలేదని అభ్యర్థులు, తల్లిదండ్రులు పలు సెంటర్ల వద్ద గుసగుసలాడుకోవడం కనిపించింది. వాయిదా పడతాయో.. లేక జరుగుతాయో తెలియక ఎంతో మంది అభ్యర్థులు టెన్షన్‌కు లోనయ్యారు. ఆ పరిస్థితుల్లో పరీక్షలను సరిగా రాయలేకపోయామని పలువురు వాపోయారు. ఆదివారం ఈ మేరకు తిరుపతిలోని 13 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలకు కేవలం 86 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ, వాయిదా అంటూ అయోమయం, ప్రశ్నపత్రాల సరళిపై గ్రూప్‌–2 పరీక్ష రాసిన అభ్యర్థులు సాక్షితో పలు అంశాలపై స్పందించారు.

పరీక్ష కేంద్రంలోకి పరుగులు తీస్తున్న అభ్యర్థి

ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సింది

గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి ఉంటే బాగుండేది. పారదర్శకంగా ఉండేదని అభ్యర్థులు అందరూ అభిప్రాయపడుతున్నారు. ఆఫ్‌లైన్‌ ద్వారా నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదనిపిస్తోంది. గతంలో ప్రిల్సిమ్స్‌ ఆఫ్‌లైన్‌లో నిర్వహించినా మెయిన్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తూ వచ్చారు గ్రూప్‌–2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు, అధికారుల హడావుడి ఎక్కువగా అనిపించింది. పరీక్ష కేంద్రానికి సుమారు అర కిలోమీటరు దూరంలో స్టాపింగ్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నడుచుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి ఉంటే సౌకర్యంగా ఉండేది.

– సువర్ణలత, గ్రూప్‌–2 అభ్యర్థి, తిరుపతి

సరిగా రాయలేకపోయా

నాతో పాటు ఎంతో మంది అభ్యర్థులు గ్రూప్‌–2 పరీక్ష వాయిదా పడుతుందని ఆశించాం. రోస్టర్‌ రిజర్వేషన్‌ స్పష్టత వచ్చేవరకు పరీక్షలు నిర్వహించరని భావించాం. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలపై ఆలోచించకుండా ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష వాయిదా పడుతుందని టెన్షన్‌కు గురై సరిగా రాయలేకపోయా. ప్రభుత్వం పోటీ పరీక్షల హాజరవుతున్న అభ్యర్థులను ప్రతిసారీ ఇలా ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు పరీక్ష వాయిదాపై పరిశీలిస్తున్నాం అంటూ మమ్మల్ని వంచించింది. కానీ, ఏపీపీఎస్సీ అందుకు విరుద్ధంగా పరీక్ష నిర్వహణకు పూనుకోవడం దారుణం.

– శ్రీనివాసులు, గ్రూప్‌–2 అభ్యర్థి, ఎస్వీయూ

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
1
1/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
2
2/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
3
3/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
4
4/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
5
5/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
6
6/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
7
7/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
8
8/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
9
9/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు 
10
10/10

గ్రూప్‌–2 మెయిన్స్‌పై ప్రభుత్వం నాటకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement