
ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్షలు
తిరుపతి అర్బన్ : ఏపీపీఎస్సీ చేపట్టిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరిపించినట్లు వెల్లడించారు. తిరుపతిలోని 13 కేంద్రాలలో చేపట్టిన పరీక్షలకు మొత్తం 5,801 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా ఉదయం సెషన్‌కు 5,055 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 5,046 మంది హాజరైనట్లు వివరించారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను అధికారులతో కలిసి తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
ఆదిదంపతుల విహారం
నాగలాపురం: మండలంలోని సురుటుపల్లి శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో మాహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అధికార నంది వాహనంపై స్వామి, పల్లకిపై అమ్మవారు ఊరేగారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు కార్తికేయ గురుకుల్, ఈఓ లత పాల్గొన్నారు.
పక్షుల కేంద్రంలో సందడి
దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో వలస విహంగాలను వీక్షించేందుకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గూడబాతులు, నత్తగుల్లకొంగలు, తెల్లకంకణాయిలు, తెడ్డుముక్కు కొంగలు, నీటికాకులు తదితర పక్షుల కిలకిలరావాలను ఆస్వాదించారు. చెరువులో ఈదులాడుతూ పక్షులు చేస్తున్న విన్యాసాలను చూపి పరవశించారు.

ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్షలు

ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్షలు

ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment